ఆర్మూర్, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ పట్టణ శివారులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈ. రాజ శేకర్ సుమారు రూ. 20 వేల విలువ గల స్పోర్ట్ (ఆట వస్తువులు) పరికరాలను కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి కోరికమేరకు ఈఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వితరణ చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయానంద రెడ్డి మాట్లాడుతూ ఈఆర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజ శేకర్ మా కళాశాల విద్యార్థులకు స్పోర్ట్స్ పరికరాలను ఇవ్వడం మాకు సంతోషం కలిగిందని మా విద్యార్థుల తరఫున ఆయన ధన్యవాదాలు తెలియపరుస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా ఈఆర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజ శేకర్ మాట్లాడుతూ మా ఫౌండేషన్ ఏర్పాటు చేసినదే పేద విద్యార్థులకు సహాయం చేయటానికి వారిని మంచి ఉన్నతరాలు పేద విద్యార్థులు ఉండాలని, విద్యతోపాటు విద్యార్థులకు క్రీడలు కూడా ముఖ్యమే కావున ప్రిన్సిపల్ సూచన మేరకు విద్యార్థులకు చిరు పరికరాలు ఇవ్వడం జరిగిందని అన్నారు, పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుతాను అంటే మా ఈఆర్ ఫౌండేషన్ సహాయం చేయటానికి ముందుంటుందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో ఈఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ చేసే కార్యక్రమాలలో ముందుండే సభ్యులు అర్గుల్ సురేష్, గంగ మోహన్, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ నాయక్, ఇస్తకొద్దీన్, శాయంపేట గంగారెడ్డి, కొడిచర్ల మహిపాల్ రెడ్డి, నీట్ శేఖర్, శ్రీకాంత్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.