కామారెడ్డి, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎల్లవ్వ (62) కు ఆపరేషన్ నిమిత్తమై ఆర్విఎం వైద్యశాలలో ఒంటిమామిడిలో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన రవి మానవతా దృక్పథంతో స్పందించి 33 వ సారి రక్తం అందించారని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో 100 మంది రక్తదాతలు సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారని, అందులో రవి కూడా ఒకరిని ఏమాత్రం ప్రయోజనం ఆశించకుండా తోటి వారి ప్రాణాలను కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్లి రక్తదానం చేయడం వారికి సమాజం పట్ల ఉన్న బాధ్యత కూడా నిదర్శనంగా కనబడుతుందని అన్నారు. రక్తదాతకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.