బాన్సువాడ, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన వారిని గుర్తించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియని, రేషన్ కార్డుల పై ఎవరు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ప్రకటన కూడా చేసిందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళను, రైతు భరోసా, ఆత్మీయ భరోసా అర్హులైన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు అందజేయకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలకు సంక్షేమం కోసం రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టి నిజమైన పేద వారి కోసం సంక్షేమ పథకాలు అందించడం కోసమే గ్రామాలలో గ్రామసభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దిన్, ఉప తహసిల్దార్ గంగ ప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఆర్‌ఐ అశోక్,నాయకులు గోపాల్ రెడ్డి, గంగుల గంగారం, కుమ్మరి రాజు ,విట్టల్ రెడ్డి, జనార్ధన్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, రహెల బేగం, నవీన్ గౌడ్, సృజన్ రెడ్డి, ఏఈఓ రాణి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.