నిజామాబాద్, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రగతిశీల కేజీబీవి నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ పి. అశోక్‌చే యూనియన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 495 కేజీబీవీల్లో నాన్ టీచింగ్, వర్కర్లు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉందన్నారు.
కేజీబీవి నాన్ టీచింగ్, వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఉద్యోగ భద్రత, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. వీక్లీ ఆఫ్, జాబ్ చార్ట్‌ను అమలు చేసి, పనిభారం తగ్గించాలన్నారు. రిటైరైన వారికి 5లక్షల గ్రాట్యూటీ, మృతి చెందిన వారికి రూ. 10 లక్షల ఎక్స్రేషియా చెల్లించాలన్నారు.
ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.ఈశ్వరి, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు హేమలత, జిల్లా కార్యదర్శి సుమలత, జిల్లా ఉపాధ్యక్షులు సుజాత, ప్రశాంతి సహాయ కార్యదర్శులు సంధ్య, దివ్య జిల్లా కోశాధికారి శోభ, జిల్లా నాయకులు లత తదితరులు పాల్గొన్నారు.