కామారెడ్డి, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డ్ పరిధిలోని ఓరియంటల్ స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ సానిటేషన్ స్టోర్ రూం ను ఛైర్పర్సన్ కుమారి నిట్టు జాహ్నవి చేతుల మీదుగా ప్రారంభించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.