కామారెడ్డి, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గల మైసమ్మకు బోనాలను ఓరియంటల్ స్కూల్ ఆవరణ సానిటేషన్ ఆఫీస్ నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్‌లోని మైసమ్మకు సమర్పించారు.
బోనాల ఊరేగింపు పూజ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కుమారి నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ దేవేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ఊరేగింపు కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.