బాన్సువాడ, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి మండలిలో తన గొంతు వినిపిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండిరగ్లో ఉన్న డిఏలు, జిపిఎఫ్ బిల్లులను అమలు చేసి పిఆర్సినీ ప్రకటించి అమలు చేయాలన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఇందిరాపార్క్ వద్ద జరిగే తపస్ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్ ఆర్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవత సురేష్, నాయకులు జిల్లా అధ్యక్షుడు పులగం రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్, రమేష్ కుమార్,,సాయిరాం, శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మణ చారి,నారాయణ చారి, భాస్కర్, శివాకాంత్, జనార్దన్, సంతోష్,కిష్టయ్య, శంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.