నిజామాబాద్, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకంలో మొక్కల సంరక్షణకు అవకాశం ఉన్నందున వాటిని పూర్తిస్థాయిలో బ్రతికించడానికి సంరక్షకులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో హరితహారంపై ఆర్‌ఆర్‌బి, పి.ఆర్. డిఆర్‌డిఎ అధికారులతో ఏవెన్యూ ప్లాంటేషన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 3 మీటర్లకు ఒక మొక్క ఉండాలని ఆయన తెలిపారు. గత ఏడు సంవత్సరాల నుండి మొక్కలు పెడుతున్నాం హరితహారంలో ఇంకా ఎందుకు పెట్టవలసి వస్తుంది, ఈసారి వదిలేయకుండా ఎట్టి పరిస్థితుల్లో మెయింటెనెన్స్ తప్పకుండా ఉండాల్సిందే అన్నారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా ప్రతి పనికి అవకాశం ఉన్నందున ఏవెన్యూ ప్లాంటేషన్‌లో ఒక్క గుంతకు అవ్వడానికి 63 రూపాయలు మొక్క నాటడానికి 35 రూపాయలు, కర్ర 15 రూపాయలు, ట్రీ గార్డ్ కు 120 రూపాయలు చెల్లించ వలసి ఉంటుందన్నారు. మొక్కలు పెట్టిన తర్వాత మూడు సంవత్సరాలు నిర్వాహణ క్రింద కూలి ఇస్తున్నామన్నారు. ప్రతి నాలుగువందల మొక్కలకు ఒక వాచ్ అండ్ వార్డ్ పర్సన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.
ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా ప్రతిరోజు 237 రూపాయలు ఇస్తామన్నారు. ఆదివారం తప్ప ఏవిన్యూ ప్లాంటేషన్‌లో సంవత్సరంలో 36 ట్యాంకర్లు వాడుతున్నారు. అందుకు ట్యాంకర్‌కు 750 రూపాయలు గ్రామ పంచాయతీకి అన్ని రకాల ప్రొవిజన్స్ ఉంది, కావలసింది కమిట్మెంట్ మాత్రమే అన్నారు. వందకు వందశాతం ప్లాంటేషన్ జరగాలని, ఉంటే మొక్కలు నాటాలి అన్నారు.
వంద శాతం ఆర్‌అండ్‌బి రోడ్లకు మొక్కలు చూసే బాధ్యత మీదే అన్నారు. వచ్చే సంవత్సరం ఏవిన్యూ ప్లాంటేషన్ అనే మాట ఎత్త వద్దన్నారు. వచ్చే సంవత్సరం నుండి మెయింటెనెన్స్ మాత్రమే ఉండాలన్నారు. రోడ్లు వేయడం ఈజీ ఆ రోడ్లకు మొక్కలు పెంచడం చాలా కష్టం, మొక్కలు పెట్టించడం పెరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా. ఆర్‌అండ్‌బి ఏఈ రాంబాబు, ఏఈలు పాల్గొన్నారు.