ఆర్మూర్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆలూరు మండల కేంద్రంలో నిర్మించనున్న వెయ్యి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి శనివారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం స్వయంభుగా వెలసిన పవిత్ర క్షేత్రం కావడంతో, భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేలా ఆలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి దాతల సహకారం ఎంతో అవసరమని సూచించారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించాలని భక్తులను కోరారు.
కార్యక్రమంలో కళ్లెం భోజరెడ్డి, దుమజీ శ్రీనివాస్, మూలకిడి శ్రీనివాస్ రెడ్డి, పెర్కిట్ రమేష్, గాండ్ల రమేష్, డాక్టర్ అరుణ్, తోక శ్రీను, మల్లయ్య, మోహన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.