హైదరాబాద్, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
యూఏఈ దేశం దుబాయి లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలోని ‘ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం’ ను మాజీ ఎమ్మెల్యే, ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి సోమవారం సందర్శించారు. ఆయన వెంట నంగి దేవేందర్ రెడ్డి, మంద భీంరెడ్డి, ఎస్. వేణు, కటుకం రవి ఉన్నారు.
దౌత్య అధికారులు పబిత్ర కుమార్ మజుందార్, అమ్రీష్ కుమార్, దీపక్ లు రాయబార కార్యాలయం పక్షాన కార్మికులకు అందిస్తున్న సేవలను అనిల్ ఈరవత్రి బృందానికి వివరించారు.