కామారెడ్డి, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శాంతకు నిమ్స్ వైద్యశాల హైదరాబాదులో బ్రెయిన్ ఆపరేషన్ నిమిత్తమే ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కాగా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 45 వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతిరోజు చాలామంది రక్తం కోసం సంప్రదించడం జరుగుతుందని వారందరికీ సకాలంలో రక్తాన్ని అందజేయాలంటే రక్తదాతలు ముందుకు రావాలని ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్ రెడ్డి కి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 కి నెంబర్కి సంప్రదించాలని అన్నారు.