నిజామాబాద్, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
.
నిజామాబాద్, బోధన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 154 కేసుల్లో పట్టుబడిన రూ. 12 కోట్ల విలువ చేసే గంజాయి, మత్తు పదార్థాలను గురువారం కాల్చివేశారు. నిజామాబాద్ డిప్యూటి కమిషనర్ సోమిరెడ్డి డిస్పోజల్ అధికారి ఇచ్చిన అదేశాల మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ కే. మల్లారెడ్డి ఇతర యంత్రాంగం నిమాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో ఉన్న ప్రభుత్వ అమోదిత కాల్చివేత కంపెనీ శ్రీ మేడికేర్‌లో గంజాయి, మత్తు పదార్ధాలను కాల్చివేశారు.
కాల్చివేసిన వాటిల్లో 1700.5 కిలోల గంజాయి, 64.27 కిలోల ఆల్పోజోలం, 72.2 కిలోల డ్కెజోఫామ్, ఒక గంజాయి మొక్కను కాల్చివేశారు. గంజాయి, మత్తు మందులను కాల్చివేసిన నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.