జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలోని మధ్వ రాయల పుణ్యక్షేత్రం అయిన శ్రీ ఆనందరిగి లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రంలో ఆదివారం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఆలయ ప్రధాన అర్చకులు దండాల మోహన్ శర్మ ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు గ్రామాలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరణ చేసిన పల్లకిలో శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపుగా గ్రామ ప్రధాన కూడలుల మీదుగా మేలతాళాలు మంగళ హారతులతో మహిళలు గ్రామం నుండి గుట్ట పైకి తీసుకెళ్లారు.
కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు డిష్ బాలయ్య, సోషల్ మీడియా వారియర్ తెలంగాణ జాగృతి అధ్యక్షులు అజయ్,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు మహిళలు భక్తులు, తదితరులు పాల్గొన్నారు.