జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, సర్వ దేవత పూజా, హోమం, ప్రాత: బలిహారణం మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి కళ్యాణంలో భాగంగా కొండ ప్రదక్షిణ ద్వార స్వామి అమ్మ వార్లకు ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ అర్చకులు దండాల మోహన్ శర్మ అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించి తరించారు. బుధవారం రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.