జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈనెల 13 నుండి 16 వరకు డిస్టిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, శంబాజీ నగర్, మహారాష్ట్రలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-14 పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థిని చిక్కాల శ్రీ వర్షిని పాల్గొంటున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా జాతీయ పోటీలకు ఎంపికైన పాఠశాల విద్యార్థిని చిక్కాల శ్రీ వర్షిని నీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్ అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్ర పోటీలలో జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలవడానికి కీలకపాత్ర పోషించి జాతీయ పోటీలకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ జాతీయ పోటీలలో రాష్ట్ర జట్టు ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలి అన్నారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్ర జాతీయ పోటీలను రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సునీత, కృష్ణ, మాలతి, మరియు ఓ ఎస్ శేఖర్ పాల్గొన్నారు.