ఆర్మూర్, ఫిబ్రవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని హెల్త్ సూపర్వైజర్ అనసూయ కుమారి ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాల లబ్ధిదారుల జాబితాను ముందస్తుగా తయారు చేసుకుని ప్రతి చిన్నారికి టీకాలు అందే విధంగా ఆశా కార్యకర్తలు చూడాలని ఆదేశించారు వ్యాక్సిన్ కోల్డ్ చైల్డ్ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్, శ్యామల, ఆశా కార్యకర్తలు శిరీష, గర్భిణి స్త్రీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.