జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు బుధవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ,పంచామృత అభిషేకము, సర్వ దేవత పూజా,హోమం, ప్రాత: బలిహారణం మధ్యాహ్నం 1 గంటకు రథప్రతిష్ట, రథహోమం, రథ బలి, పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామి వారికి అర్చకులు విశేష పూజలు జరిపి రథభ్రమణం జరిపించారు.
తరువాత సాయం ఔపాసన హోమం, బలిహారణం నిర్వహించారు. అలాగే 13వ తేదీ గురువారం పూర్ణహూతి, స్నాపన తిరుమంజనం, చక్రతీర్థం, సాయంత్రం 5.గంటలకు పూష్పాయాగం నాగవెల్లి తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.