నిజామాబాద్, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీల సర్పంచ్, కార్యదర్శులదేనని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో హరిత హారంపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న ప్రతి రోడ్డులో ఆగస్టు 13 నాటికి ఏవిన్యూ ప్లాంటేషన్ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్లో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి అన్నారు. ప్రభుత్వ ఉద్దేశం ఏ రోడ్డు మొక్కలు లేకుండా ఉండకూడదని ప్రతి 500 జనాభా కలిగిన గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రెటరీని నియమించిందని, జిపి పరిధిలోని ప్రతి రోడ్డు మొక్కలు ఉండే విధంగా చూసే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
అవసరమైన చోట మొక్కలు కొని పెట్టాలని ట్రాన్స్ పోర్ట్‌తో 150 రూపాయలకు పెద్ద మొక్కలు వస్తావని గ్రీన్ బడ్జెట్ నుండి కొనాలి అన్నారు. నాటిన మొక్కలు మెయింటెన్ చేయాలనీ గ్యాప్ ఉన్నచోట కొత్త మొక్కలు పెట్టాలన్నారు. ఆగస్టు 13 తేదీ నాటికి పూర్తి స్థాయి మార్పు రావాలన్నారు.
3 మీటర్లకు ఒక మొక్క ఉండేలా ఏఈలు మానిటర్ చేయాలని ఆదేశించారు. నాలుగు వందల మొక్కలకు ఒక వాచ్ అండ్ వార్డ్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, పంచాయతీరాజ్ ఏఈలు పాల్గొన్నారు.