ఆలూరులో ఘనంగా ఊర పండగ…

ఆర్మూర్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత ఆలూరు గ్రామంలో 18 గ్రామ దేవతలను కొలిచి డప్పు వాయిద్యాల నడుమ, పోతరాజుల విన్యాసాల నడుమ గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఊర పండగ ఉత్సవం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలోని 18 అమ్మవార్ల దగ్గర గంగాపుత్రులతో డప్పు వాయిద్యాలతో ముడుపు వేసి నియమ నిబధనలతో మొక్కి శనివారం రోజున మామిడి చెట్లు కోసి గ్రామ వడ్రంగులతో కొత్త విగ్రహాలు చెక్కించి ఆదివారం తెల్లవారుజాము నుంచి డప్పు చప్పుళ్ళతో కట్టిన ముడుపు విడిపించి కొత్త విగ్రహాలు ప్రతిష్టించి మేకలు బలి ఇచ్చి ఘనంగా పూజలు నిర్వహించారు.

గ్రామస్థుల ఆనందోత్సాహాల మధ్య పోతారాజుల విన్యాసాలమద్య గ్రామ నడి బొడ్డున గల మహాలక్ష్మి అమ్మవారి మందిరం దగ్గర మేకలను బలి ఇచ్చి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో పదికాలాలపాటు చల్లగా ఉండేటట్టు దీవించాలని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ రెవిన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామాల్లోకి ఎటువంటి చీడ పిడలు, రోగాలు రాకుండా గ్రామ పొలిమేరల చుట్టూ సరి చల్లారు.

ఊర పండగ విజయవంతం కోసం గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో 33 కుల సంఘాల పెద్దలు చేసిన కృషికి గ్రామస్థులు, గ్రామ నాయకులు అభినందించారు. కార్యక్రమంలో విడిసి అధ్యక్షుడు ఆకిడి సత్యం, వైస్‌ ఎంపిపి మోతె బోజకళ చిన్నారెడ్డి, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్‌ ఆలూరు శ్రీనివాస్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ కళ్ళెం మోహన్‌ రెడ్డి, సొసైటీ చైర్మెన్‌ కళ్లెం బోజరెడ్డి, ఉప సర్పంచ్‌ ధుమ్మాజి శ్రీనివాస్‌, ఎంపీటీసీ 2 లక్ష్మి మల్లేష్‌, ఎస్‌ఎంసి చైర్మెన్‌ వెల్మ గంగారెడ్డి, వార్డు సభ్యులు, 33కుల సంఘాల పెద్దలు, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »