కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న శిల్ప (24) కి బి పాజిటివ్ రక్తం అవసరం కావాలని వారి కుటుంబ సభ్యులు సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతన సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ 28 వ సారి ప్రభుత్వ వైద్యశాల లోని రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో కొందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు సంఘాల ముసుగులో పాఠశాలలకు వెళ్లకుండా,రియల్ ఎస్టేట్ వ్యాపారాలు,ప్రైవేటు కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ సమాజంలో చెడ్డ పేరు తీసుకువస్తుంటే,జమీల్ హైమద్ మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడమే కాకుండా,తలసేమియా చిన్నారులకు మెగా రక్తదాన శిబిరాలను విజయవంతం చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకొని ఉపాధ్యాయ లోకానికే ఆదర్శంగా నిలిచాడని అన్నారు.
కార్యక్రమంలో ఉపాద్యాయులు సాదిక్ అలీ, సంతోష్, టెక్నీషియన్ అమర్ పాల్గొన్నారు.