పిజి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

నిజామాబాద్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌. బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పిజి, ఎంబిఎ పరీక్షలు సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 1 వరకు నిర్వహించబడతాయని అధ్యయన కేంద్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంబిఎ మూడవ సంవత్సరం సెప్టెంబర్‌ 13 నుండి 18వ తేదీ వరకు

పిజి, ఎంబిఎ రెండవ సంవత్సరం సెప్టెంబర్‌ 22 నుండి 26వ తేదీ వరకు

పిజి మొదటి సంవత్సరం 28 సెప్టెంబర్‌ నుంచి 1 అక్టోబర్‌ వరకు

పైన తెలిపిన పరీక్షల ఫీజు చెల్లించడానికి ఆగష్టు 16వ తేదీవరకు గడువు ఉందని, ఒక్కో పేపరుకు రూ. 150 నుంచి రూ. 200 వరకు ఫీజు పెంచినట్టు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు టిఎస్‌ ఆన్‌లైన్‌, మీసేవా ద్వారా చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 7382929612 నెంబర్‌లో లేదా వెబ్‌సైట్‌లో సంప్రదించాలని అంబర్‌సింగ్‌ తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »