కామారెడ్డి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వచ్చే సోమవారం (24-2-2025) నాటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
శాసన మండల ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ప్రజల విజ్ఞాపనలు తీసుకోవడానికి కలెక్టరేట్‌లోని రూం నెంబర్ 25 లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల సమస్యల దరఖాస్తులు హెల్ప్ డెస్క్‌లో అందజేయవచ్చని తెలిపారు.