డిచ్‌పల్లి, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో సివి రామన్ జన్మదిన వేడుకలు ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించవలసింది మానవ కల్యాణానికే కానీ మారణ హోమానికి కాదని సివి రామన్ తెలిపారని కొనియాడారు. విశ్వవిద్యాలయాలు లోతైన శాస్త్రీయ పరిశోధన నిర్వహించి సమాజానికి దిక్సూచిగా పనిచేయాలన్నారు.
కార్యక్రమానికి పరీక్షల నియంత్రణ అధికారి కే సంపత్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ,పి ఆర్ ఓ (డైరెక్టర్) ఏ పున్నయ్య, సైన్స్ డీన్ ఆచార్య సిహెచ్ ఆరతి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ ప్రసన్న శీల, డాక్టర్ నీలిమ, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.