కామారెడ్డి, మార్చ్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న నర్సింగరావు (78) ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. భిక్కనూర్ మండలం లక్ష్మీ దేవునిపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 25 వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమద్ లు మాట్లాడుతూ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది,డబ్బుతో పొందలేనిది కేవలం రక్తం మాత్రమేనని,ఎంత డబ్బు ఉన్నా సకాలంలో రక్తం దొరకకపోతే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానానికి ముందుకు వస్తూ,ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేస్తున్న బద్దం నిశాంత్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.