నిజామాబాద్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శాసన సభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్ అంకిత్ విచ్చేసి, శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ స్పీకర్ గా శ్రీపాదరావు అందించిన సేవలను స్మరిస్తూ, శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి జె.ముత్తెన్న, ఎన్.ఐ.సీ అధికారి మధు, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.