నిజామాబాద్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
హిందూ సమాజంలోని వ్యక్తులలో సంస్కారాలను నిర్మాణం చేసి తద్వారా దేశభక్తులుగా మరియు సమాజ సంరక్షకులుగా తయారు చేసేందుకు వ్యక్తుల నిర్మాణానికి అవసరమయ్యే శిక్షణను అందించే కర్మాగారమే సంఘ శాఖ అని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ భౌధిక్ ప్రముఖ్ విజయ భాస్కర్ వ్యాఖ్యానించారు.
ఇందూరు నగరం కోటగల్లి ఉప నగరంలోని పద్మశాలి హైస్కూల్లో ప్రతినిత్యం జరిగే పరుశురామ ప్రభాత్ శాఖా వార్షికోత్సవంలో ప్రధాన వక్తగా కృష్ణశాస్త్రి విజయ భాస్కర్ పాల్గొని ప్రసంగించారు. సంఘ శాఖ కార్యకర్తల వికాసానికి తోడ్పాటున అందిస్తుందని, శాఖ ద్వారా స్వయంసేవకులలో ఆత్మవిశ్వాసం, ధైర్యం జట్టు భావన ఏర్పడతాయన్నారు.
ఆటల ద్వారా పాటల ద్వారా వ్యక్తిలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడమే సంఘ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. ఒక విత్తు ఎలాగైతే మహావృక్షం ఆ మారుతుందో సంఘ శాఖ కూడా సమస్త హిందూ సమాజానికి పునాది రాయి లాంటిదని సంఘ శాఖల ద్వారానే హిందూ సమాజం ఈరోజు చైతన్యవంతమైందని తెలిపారు.

కార్యక్రమంలో నగర కార్యవాహ అరుగుల సత్యం, సహకార్యవాహలు సుమిత్, వెంకటేష్, భద్రయ్య, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వయంసేవకులు నిర్వహించిన సంచలన్ మరియు శారీరక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.