డిచ్‌పల్లి, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ (బి. ఏ, బి. కామ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బి బి ఏ, బీసీఏ ) ఒకటవ మూడవ మరియు ఐదవ సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్టార్ ఆచార్య ఎం.యాదగిరి, కంట్రోలర్ ఆచార్య సంపత్ కుమార్ విడుదల చేశారు.
బిఎ లో 3534 మంది విద్యార్థులు హాజరుకాగా 998 మంది 28.24 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 13.70 శాతం కాగా బాలికలు 44.04 శాతం ఉత్తీర్ణులైనారు.
బికాం లో 5578 మంది విద్యార్థులు హాజరుకాగా 1902 మంది 34.10 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 17.55 శాతం కాగా బాలికలు 49.76 శాతం ఉత్తీర్ణులైనారు.
బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 5644 మంది విద్యార్థులు హాజరుకాగా 2279 మంది 40.38 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 17.34 శాతం కాగా బాలికలు 44.04 శాతం ఉత్తీర్ణులైనారు.
బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో 4199 మంది విద్యార్థులు హాజరుకాగా 1003 మంది 23.89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 6.01 శాతం కాగా బాలికలు 31.31 శాతం ఉత్తీర్ణులైనారు.
బిబిఎలో 597 మంది విద్యార్థులు హాజరుకాగా 252 మంది 42.21 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 21.45 శాతం కాగా బాలికలు 65.72 శాతం ఉత్తీర్ణులైనారు.
బిసిఎ లో 22 మంది విద్యార్థులు హాజరుకాగా 2 (ఇద్దరు ) మంది 9.09 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 5.00 శాతం కాగా బాలికలు 50.0 శాతం ఉత్తీర్ణులైనారు.
మొత్తం విద్యార్థులు 19574మంది విద్యార్థులు హాజరుకాగా 6436 మంది 32.88శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 14.58 శాతం కాగా బాలికలు 42.83 శాతం ఉత్తీర్ణులైనారు.
ఫలితాల ప్రకటన కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్లు డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయి, డాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.