హెల్త్‌ సర్వేలో వ్యాధులకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్ర ఆరోగ్య సర్వే పూర్తిగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.

మంగళవారం నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి ఆయన నగరంలోని 48 వ డివిజన్‌ పరిధిలోగల పాటిగల్లి., 9 వ డివిజన్‌ లోని వడ్డెర కాలనీలో పర్యటించి సర్వే తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లయితే వారికి కోవిడ్‌ కిట్టు అందజేయాలని, ప్రతిరోజు మందులు వాడుతున్నారా లేదా పరిశీలించాలన్నారు.

కోవిడ్‌ 19, క్యాన్సర్‌, హెచ్‌ఐవి, తలసేనియా, టిబి, డయాలసిస్‌ తదితర ఆరు అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని గుర్తించడానికి ప్రతి ఒక్క ఇల్లు విడవకుండా సందర్శించి వ్యాధులు ఉన్నవారికి పరీక్షలు జరిపి చికిత్స అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం నుండే సమయం వృధా చేయకుండా పక్కాగా, పర్‌ఫెక్ట్‌గా సర్వే చేయాలని, మొబైల్‌ యాప్‌లో లక్షణాలున్నవారి సమాచారం పొందుపరచాలన్నారు. సర్వే సందర్భంగా సేకరించిన వివరాలు నమోదు చేస్తున్న రిజిస్టర్‌ పరిశీలించారు.

అనంతరం నాగారం స్టేడియంలో ఉన్న పట్టణ ప్రకృతి వనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెద్ద మొక్కలు చాలా బాగున్నాయి అన్నారు. డివిజన్‌ కార్పొరేటర్‌ వనిత శ్రీనివాస్‌, ఇంచార్జ్‌ డిఎం హెచ్‌వో సుదర్శనం, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »