ఆర్మూర్, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ సర్వేను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ పండిత్ వినిత పవన్ తెలిపారు. హెల్త్ వీక్ సర్వే మంగళవారం నుండి 7వ తేదీ వరకు కొనసాగుతుందని, పట్టణంలోని ప్రతి వార్డులలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని తెలిపారు.
అదేవిధంగా డైనమిక్ ఎంఎల్‌ఏ జీవన్ రెడ్డి కృషివలన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తునందువలన పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంపై ఎటువంటి అనుమానాలున్నా హెల్త్ వీక్ సర్వేలో వివరాలు తెలపాలని ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, మహిళ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.