కామారెడ్డి, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అదనపు కలెక్టర్ (రెవిన్యూ) తో కలిసి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ జనార్ధన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, నాయబ్ తహసీల్దార్ అనీల్, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.