నిజామాబాద్, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. 652 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,649 మంది విద్యార్థులకు గాను17,997 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 96.5 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.
ఇంటర్ బోర్డు పరీక్షల విభాగం డిప్యూటీ సెక్రటరీ లు యదగిరి, ఖాదర్ షరీఫ్‌లు ధర్పల్లిలో రెండు పరీక్ష కేంద్రాలు, భీంగల్ లోని రెండు పరీక్ష కేంద్రాలు, మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి సమీక్షించారు.
నిజామాబాద్ పట్టణంలోని ఒకటవ టౌన్ పోలీసు స్టేషన్‌లో ప్రశ్న పత్రాల నిక్షిప్తం చేసిన విధానం పరిశీలించి కస్టోడియన్ ప్రశ్న పత్రాల పంపిణీని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ పరిశీలించారు.
జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 49 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు.. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు తాను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు, హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షణ చేసారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి పేర్కొన్నారు.
జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ పట్టణంలోని కంటేశ్వర్ ఎస్సార్ జూనియర్ కళాశాలలు ఏ, బి కేంద్రాలను, దాస్ నగర్‌లోని మహాత్మా జ్యోతిబపూలే జూనియర్ కళాశాల, మక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నందిపేట్‌లోని మోడల్ జూనియర్ కళాశాల, ఐలాపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు.
హై పవర్ కమిటీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఖిల్లా జూనియర్ కళాశాల, సిఎస్‌ఐ జూనియర్ కళాశాల, నిర్మల హృదయ కళాశాల, కాకతీయ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు.
పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుదిన్ అస్లాం, కనకమహాలక్ష్మి 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయగా హై పవర్ కమిటీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో 5 పరీక్ష కేంద్రాలను, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నర్సయ్య, బాలాజీ, యమున బృందం 21 పరీక్ష కేంద్రాలను, సిటింగ్ స్కాడ్ బృందాలు ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. బల్క్ అధికారి బుద్ధిరాజ్ మూడు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.