జక్రాన్‌పల్లి, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈనెల 8న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్‌లో భాగంగా బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం, రాజీవ్ గాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ బాసర ఐఐటి, కదిలి పాపేశ్వరాలయం, కాల్వ నరసింహస్వామి దేవాలయం, నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ మరియు పోచంపాడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, డ్యాం లను సందర్శించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి మూడేళ్ల శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా బాసర అమ్మవారి దీవెనలు పొందడం అలాగే పోచంపాడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ ఏ విధంగా తయారవుతుందో విద్యార్థులు ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు. ఎడ్యుకేషన్ టూర్ అనేది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఎడ్యుకేషనల్ టూర్ లో 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు గంగాధర్, డాక్టర్ నరసింహారావు, సునీత, మాలతి, మర్కంటి గంగా మోహన్ పాల్గొన్నారు.