ఆర్మూర్, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు అలె భాస్కర్, రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి స్వామి యాదవ్ పిలుపు మేరకు దేశ ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
అన్ని వర్గాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఓబిసి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోని 27 శాతం ఆర్థిక బలహీనమైన విభాగానికి చెందిన విద్యార్థులకు 10 శాతం యుజి, పిజి మెడికల్, డెంటల్ కోర్సుల్లో రిజర్వేషన్‌లను అల్ ఇండియా కోట కింద స్కీమ్ కింద 2021-22 విద్యా సంవత్సరం నుండి రిజర్వేషన్ కల్పించడం చాలా సంతోషకరమన్నారు. ఈ నిర్ణయంతో ఓబిసి, ఇడబ్ల్యుసి వర్గాల వారైన సుమారు 5 వేల 500 మంది విద్యార్థులకు ప్రయెజనం చేకూరుతుందన్నారు.
ఈ విషయంలో దేశం 70 ఏండ్లు మనకు అధికారం వచ్చిన ఎవరు పట్టించుకోలేదని, ఇన్నాళ్లు ఓట్ బ్యాంక్ కోసం మాత్రమే కొన్ని పార్టీలు పనిచేసాయని, ఇలాంటి ఓబిసి, ఇడబ్ల్యుసి రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమని నిరూపితమైందన్నారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు గజేందర్, బీసీ మోర్చా అధ్యక్షులు గణేష్, ఎస్‌టి మోర్చా రాజేష్, బీజేవైఎం వెంకటేష్, రాజేష్, విజయ్, కృష్ణంరాజు. గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.