బోధన్, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు వుండవు అని చెప్పిన కేసీఆర్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే అరెస్టులా అని సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ మండిపడ్డారు.
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ మంత్రుల ఇళ్ల ముట్టడి చేయాలని విధ్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమానికి పిలుపు నివ్వగా తెల్లవారు రaాము నుండి నాయకుల ఇళ్ల నుంచి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బోధన్‌లో సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్, పీవోడబ్ల్యూ పట్టణ అధ్యక్షురాలు బి.నాగమణి, పి.వరదయ్య, సునీల్ తదితరులను అరెస్టు చేశారు.