సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 38 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 21 లక్షల 19 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 865 మందికి 5 కోట్ల 28 లక్షల 82 వేల 400 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చయిన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.

అందుకు సంబంధించిన పత్రాలను తమ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »