బాన్సువాడ, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని సాయి కృపా నగర్ కాలనీలో గల రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఆల్ ఇండియా బంజారా శక్తి పీట్ ప్రధాన కార్యదర్శి బాధ్య నాయక్ రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదంబ, సేవాలాల్ రామారావు మహారాజ్ ల భోగ్ బండార్, ప్రత్యేక పూజలు నిర్వహించి, హోలీ లేగి ఆట ఆడి అలరించారు..
ఈ సందర్భంగా బద్య నాయక్ మాట్లాడుతూ రామ్ రావు మహారాజ్ చూపిన భక్తి మార్గంలో ప్రతి తండాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని, ప్రతి ఒక్కరు మద్యపానానికి దూరంగా తమ కుటుంబాలతో ఆనందంగా గడుపుకోవాలన్నారు. ఈనెల 19న రంగ్ పంచమిన వెంకటాపూర్ లోని బాయ్ గాడ్ లో జరిగే జాతర మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాబు సింగ్, గోప్య నాయక్, బన్సీలాల్ మోహన్ నాయక్, మహేష్, భూమేష్, సురేష్, బీమా, బంజరులు తదితరులు పాల్గొన్నారు.