కామారెడ్డి, మార్చ్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ హెచ్‌ఐవి ఎయిడ్స్ నివారణలో అంగడి వాడి వర్కర్ పాత్ర కీలకమని అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ కి హెచ్‌ఐవి / సిఫిలిస్ పరీక్షలు జరిగేటట్టు చూడాలని ముందు హెచ్‌ఐవి పరీక్ష చేయడం వలన తల్లి నుండి బిడ్డకు రాకుండా నివారించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి చూడాలని అని అన్నారు.
అలాగే హెచ్‌ఐవి/ ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అప్పుడే ప్రతి ఒక్కరూ దాని భారిన పడకుండా ఉంటారని తెలిపారు. అలాగే బుదవారం కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా, మహిళా సాధారికత, సుఖ వ్యాధులు మరియు చికిత్స, సఖి సేవలు, మహిళల ఆరోగ్యం, డ్రగ్స్ నివారణ, హెచ్‌ఐవి సోకిన బాధితులకు ప్రభుత్వ సహాయాలు అంశాలపై శిక్షణ ఇచ్చారు.
కార్యక్రమంలో రవికుమార్ డిప్యూటీ డైరెక్టర్ ఐఇసి తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ హైదరాబాద్, డిపిఓ పద్మజ, డిపిఎం భారతి సఖి సెంటర్, సుధాకర్ , డిడబ్ల్యుఓ సుపరిండెంట్ భాస్కర రావు, సిబ్బంది, రాజేంద్ర కుమార్ విక్రమ్, రాణి లింక్ వర్కర్స్ డిఆర్పి సుధాకర్, 300 అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, సిడిపివోలు పాల్గొన్నారు.