నిజామాబాద్, మార్చ్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర మరియు మేర యువ భారత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాల యువ ఎక్స్చేంజ్ కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి లో గల ఎస్బిఐ ట్రైనింగ్ సెంటర్లో విజయవంతంగా పూర్తయింది.
హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎంపిక చేయబడిన 30 మంది యువతీ యువకుల బృందము ఐదు రోజులపాటు నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని చారిత్రాత్మక ప్రదేశాలు మరియు కర్మాగారాలు ఇతర దర్శనీయ స్థలాలను సందర్శించి అక్కడి పరిస్థితులను వివరాలను అధ్యయనం చేశారు. మార్చి 8వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం మానసిక శారీరక శిక్షణ కార్యక్రమాలతో పాటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని ప్రఖ్యాత దర్శనీయ స్థలాల సందర్శన మరియు నిజామాబాద్ నగరంలోని పలు వ్యవసాయ క్షేత్రాల సందర్శన, చివరగా వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు నాయకత్వ నేర్పు శిక్షణ కార్యక్రమాల నిర్వహణతో పూర్తయింది.
బుధవారం కార్యక్రమం యొక్క చివరి రోజు కావడంతో పాల్గొన్న యువతీ యువకులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
శిక్షణ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్, ఎస్బిఐ శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు మహేష్, ఇతర ప్రభుత్వ అధికారులు మరియు నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.