డిచ్‌పల్లి, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల సూచన మేరకు కళాశాల పరిసరాలలో ఉన్న వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ కవర్స్ ను తొలగించినట్టు తెలంగాణ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ మామిడాల ప్రవీణ్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని దీని కొరకు ప్రతి ఒక్కరూ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు.
కళాశాలలతో పాటు హాస్టల్లోనూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కనీసం వారంలో ఒక్కసారైనా శ్రమధానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మహేందర్ ఐలేని విద్యార్థులు పాల్గొన్నారు.