Screenshot

రెండు రోజుల పాటు 18 జిల్లాలకు అలర్ట్‌..!

హైదరాబాద్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఎండలు ముదురుతున్నాయి. మార్చి మధ్యలోనే ఎండ సెగ పెరిగిపోతున్నది. నిరుడు ఇదే టైమ్తో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీల మేర ఎక్కువే రికార్డవుతున్నాయి. గతేడాది ఒకట్రెండు జిల్లాల్లోనే 40 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదైతే.. ఇప్పుడు 18 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 39 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి.

4 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంటున్నది. గురువారం అత్యధికంగా నిర్మల్‌ జిల్లా లింగాపూర్లో 40.7 డిగ్రీల టెంపరేచర్‌ రికార్డయింది. ఆదిలాబాద్‌ జిల్లా బేల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెనలో 40.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 40.4, జగిత్యాల, నల్గొండ, పెద్దపల్లిల్లో 40.3, జయశంకర్‌ భూపాలపల్లిలో 40.2, కామారెడ్డి, ఖమ్మంలో 40.1, మంచిర్యాల, హనుమకొండ, కరీంనగర్‌, సంగారెడ్డి, సిద్దిపేటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

3 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 39 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 4 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంటున్నది. గురువారం అత్యధికంగా నిర్మల్‌ జిల్లా లింగాపూర్లో 40.7 డిగ్రీల టెంపరేచర్‌ రికార్డయింది. ఆదిలాబాద్‌ జిల్లా బేల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెనలో 40.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పలుచోట్ల 20 డిగ్రీలకన్నా ఎక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 21.8 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 20 డిగ్రీలు రికార్డ్‌ అయింది. మిగతా జిల్లాల్లో 16.8 డిగ్రీల నుంచి 19 డిగ్రీల మధ్య నైట్‌ టెంపరేచర్లు నమోదవుతున్నాయి.

రెండ్రోజులు 18 జిల్లాలకు అలర్ట్‌

మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 18 జిల్లాల్లో 41 డిగ్రీలకు టెంపరేచర్లు చేరువయ్యే అవకాశం ఉన్నట్టు తెలంగాణ డెవలప్మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ సొసైటీ (టీజీడీపీఎస్‌) అంచనా వేసింది.

నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, జనగామ, వరంగల్‌, ములుగు, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే చాన్స్‌ ఉన్నట్టు అంచనా వేసింది. కాగా, ఆగ్నేయ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడిరచింది. 3 రోజులు 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడిరచింది.

Check Also

తపస్‌ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »