బాన్సువాడ, మార్చ్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలో తపస్ శాఖ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరాలకు తెలియజేయాలని, రసాయనాలు కలిగిన రంగులను కాకుండా ప్రకృతి సహజసిద్ధమైన రంగులను వాడు ఎందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు రవీంద్ర ఆర్య, రమేష్ కుమార్, తపస్ మండల అధ్యక్షులు నరసింహ చారి, శ్రీకాంత్ రెడ్డి, నరసయ్య, కిష్టయ్య వేద ప్రకాష్, సంజీవరెడ్డి, తారాచంద్ తదితరులు పాల్గొన్నారు.