జక్రాన్‌పల్లి, మార్చ్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మాన్యశ్రీ కాన్షీ రాం 91వ జయంతి, ధర్మ సమాజ పార్టీ 2వ ఆవిర్భావ దినోత్సవం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ బహుజన పోరాటయోధుడు, బహుజన దీప స్తంభం, అంబేద్కర్ కా దూస్రా నామ్ కాన్షీరాం అని ఆయనను కీర్తించారు. ప్రతి ఒక్క బహుజనుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా బహుజన రాజ్యం కోసం పోరాటం చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్, నాయకులు చిన్న భూమన్న, రవి, దిలీప్, వెంగల్ రావ్, గంగ సాయిలు, నవీన్, కిరణ్, రాజు, అజిత్, తదితరులు పాల్గొన్నారు.