బాన్సువాడ, మార్చ్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని కృష్ణనగర్ తండా సమీపంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో హన్మజీపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని సంగ్రామ్ నాయక్ తండ గ్రామానికి చెందిన సిద్ధార్థ, రాజేష్ శనివారం పని నిమిత్తం బాన్సువాడకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు.
కాలకృత్యాలు తీర్చుకొని కాల్వలో కాళ్లు చేతులు కడుక్కునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు సిద్ధార్థ, రాజేష్ ప్రధాన కాలువలో కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి రాజేష్‌ను కాపాడినప్పటికీ సిద్ధార్థ యువకుడు కాలువలో గల్లంతయ్యాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.