డిచ్‌పల్లి, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం, వాణిజ్య విభాగం, ఎస్‌ఏపి పార్టనర్ ఈమ్‌ఈతో బుధవారం అవగాహన ఒప్పందం చేసుకున్నారు, ఒప్పందం మేరకు విశ్వవిద్యాలయం పరిధిలో బి.కాం, ఎం.కాం చేసే విద్యార్థులకు ఎస్‌ఏపి కోర్స్ చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం సిలబస్ సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు గల ఎస్‌ఏపి లాంటి కోర్సులు నేర్చుకోవాలని దాని ద్వారా డిగ్రీ పట్టా అందుకోగానే వారు వివిధ బహుళ జాతీయ సంస్థలలో ఉద్యోగం అందిపుచ్చుకుంటారని దానికి ఈ అవగాహనా ఒప్పందం ఎంతగానో ఉపయోగ పడుతుందని విభాగ అధిపతి డా. రాంబాబు గోపిశెట్టి తెలిపారు.
ఒప్పందంలో భాగంగా విద్యార్థులకు రాయితీపై ఎస్‌ఏపి పవర్ యూజర్ ప్రోగ్రాం ఎస్‌ఏపి-గ్లోబల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం కోర్సులను అందిచడం జరుగుతుందని తెలిపారు. కోర్స్‌లలో ఫికో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ కాపిటల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్ వంటి మోడ్యూల్స్ ఉన్నాయని ఇఎంఇ సంస్థ వైస్ – ప్రెసిడెంట్ జూనీ జోసఫ్ తెలిపారు.
విభాగ డీన్ ప్రోఫెసర్ ఎం.యాదగిరి విద్యార్థులకు ఒప్పందం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి సంస్థ ప్రతినిధులతో చర్చించారు. కార్యక్రమంలో విభాగ అధ్యాపకులు డా.జి. శ్రీనివాస్, ఎన్.శ్వేతా, విభాగ సిబ్బంది ఓ.రాజు, ఇఎంఇ సిబ్బంది రమేష్ చంద్ర పాల్గొన్నారు.