కామారెడ్డి, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. సోమవారం ప్రజావాణి లో (73) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యా సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండిరగులో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తు దారునికి సమాచారం అందించాలని తెలిపారు. ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో చందర్, ఆర్డీఓ వీణ, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.