కామారెడ్డి, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి లోని మంజీరా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో మొదటిరోజు గ్రామంలోని ఎల్లమ్మ గుడి పరిసర ప్రాంతాలను శుభ్రంగా చేశారు. అక్కడ ఉన్న నీటి కులాయిని, చెత్తాచెదారాన్ని తొలగించారు.
కార్యక్రమంలో మంజీరా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, డైరెక్టర్ శివరాం, సురేష్ గౌడ్, గ్రామ కార్యదర్శి శోభ, ఆలయ కమిటీ చైర్మన్ డైరెక్టర్స్ గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న యువత పాల్గొన్నారు. కోఆర్డినేటర్స్ సయ్యద్ అలీ ఖాన్, శ్రీను పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.