కామారెడ్డి, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్నుర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపూర్ణ గర్భిణీకి అపరేషన్ నిమిత్తం ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉందని బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్ రెడ్డికి సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్ గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్ సహాయంతో కాచాపూర్ గ్రామస్తుడైన ప్రైవేట్ టీచర్ ముదాం శ్రీధర్ మానవత్వంతో స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు.
శ్రీధర్ గత మూడు నెలల క్రింద హైదరాబాద్కు వెళ్లి రక్తదానం చేశారు. వారి సేవకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు, బీజేపీ కామారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనుగందుల నవీన్, రాజు, నరేష్, వీటి ఠాగూర్ రక్తనిధి నిర్వహకులు చందన్ తదితరులు పాల్గొన్నారు.