కామారెడ్డి, ఏప్రిల్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎల్లారెడ్డి పట్టణ ప్రజలను ఎన్నేళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన అమృత్ 2.0 పథకం కింద రూ.35 కోట్ల వ్యయంతో చేపట్టిన తాగునీటి సరఫరా పనులను స్థానిక శాసన సభ్యులు మదన్ మోహన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏ.ఈ.ఈ, డి.ఇ. అధికారులతో మదన్ మోహన్ మాట్లాడి, ప్రాజెక్టు పనుల పురోగతి, నాణ్యతపై సమగ్రమైన వివరాలు తెలుసుకున్నారు. పనులు వేగంగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎల్లారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.