విడిసి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణచివేస్తాము

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గత 15 సంవత్సరాలక్రితం కొన్ని గ్రామాలలో గ్రామాభివృద్ధి కోసం గ్రామభివృద్ధికమిటీలు ఏర్పాటుచేసుకోవడం జరిగింది. గ్రామాలలో గ్రామాభివృద్ధి అవసరాలకు ప్రభుత్వం నుండి సహయ సహకారాలు పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటుచేసుకున్నారు.

కాలక్రమేణ ఈ గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను కాకుండా గ్రామాలలో జరిగే సివిల్‌ తగాదాలు, భూ తగాదాలు, వివాహ సంబంధ తగాదాలు అన్నదమ్ముల తగాదాలు, భార్యభర్తల తగాదాలలో వారిని పిలిపించి, అట్టి పంచాయితీలలో వారు విననియేడలవారికి దండుగా వేసి, చట్టం చేయవలసిన పనిని వారి చేతులోనికి తీసుకొని, వాళ్ళను పోలీస్‌ స్టేషన్‌ కు, న్యాయ స్థానాన్ని ఆశ్రయించకుండా గ్రామ ప్రజలను తాము చెప్పినవిధంగా వినాలని ఎవ్వరూకూడా పోలీస్‌ స్టేషన్‌, న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదని లేనియెడల మా మాట వినని వారిని ఆ గ్రామం నుండి వెలివేస్తాము అని, భయబ్రాంతులకు గురిచేసి, గ్రామంలో డబ్బులు వసూలు చేయడానికి గ్రామాభివృద్ది కమిటి పేరుతో బెల్టుషాపులు, కూల్‌ డ్రిరక్‌ షాపులు, కిరాణ షాపు మరియు కోడిగ్రుడ్డు ధర పై యాక్షన్‌ (వేలం వేయడం) వేయడంలో ఎవరు ఎక్కువధర చెల్లిస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆ గ్రామంలో ఆ వస్తువులను అమ్మేటట్లు నియమముగా పెట్టి డబ్బులు వసూళ్ళు చేస్తారు.

గ్రామంలో ఎప్పుడైన పంచాయితీలు నిర్వహించినప్పుడు ఇరువర్గాల నుండి డబ్బులు వసూళ్లు చేసి పంచాయితీలను నిర్వహిస్తారు. అట్టి డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేస్తారు. కావున గ్రామాభివృద్ధి కమిటి నిర్వహించే కార్యకలాపాలు పూర్తిగా చట్టవ్యతిరేకం.

ఎవ్వరికైనా గ్రామాభివృద్ధి కమిటీల వలన ఎలాంటి ఇబ్బందుల వచ్చిన వారు తమ దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌ అధికారిని సంప్రదించాలని నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ సాయి చైతన్య వెల్లడిరచారు. కావున భవిష్యత్తులో ఎవ్వరయిని ఇలాంటి బహిష్కరణలు చేసినట్లయితే వారిపై చట్టరిత్య కఠిన మైన చర్యలు తీసుకోబడుతాయని, ఎవ్వరిని కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Check Also

యోగ ఇన్స్ట్రక్టర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐటీయూసీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »