నిజామాబాద్, ఏప్రిల్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో యోగా ఇన్స్ట్రక్టర్ల సమావేశం పురుషోత్తం అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో పనిచేస్తున్న యోగ శిక్షకులకు పని భద్రత కల్పించి 26 వేల రూపాయల వేతనం అమలు చేయాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో యోగా ఇన్స్ట్రక్టర్లను నియామకం చేశారని, కానీ వారికి ప్రభుత్వం ప్రతినెల వేతనాలు చెల్లించకుండా, చట్టప్రకారం వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.
సమస్యల పరిష్కారానికి యోగ ఇన్స్ట్రక్టర్ లందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు టి. చక్రపాణి, నాయకులు ప్రవీణ్, శ్రీనివాస్, విజయేందర్, స్వాతి, నమ్రత యోగ ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు.